పంచాయితీ రాజ్ చట్టంలో సవరణలకు ప్రభుత్వం ఆమోదం
పంచాయితీ ఎన్నికల్లో పోటీచేసే వ్యక్తులు గ్రామాల్లో ఉండేలా, గ్రామ అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో రోజువారీ పాల్గొనేలా కొన్ని సవరణలు
ఎన్నికల్లో ప్రలోభపెట్టే చర్యలను నివారించేందుకు సవరణలు
పంచాయితీ, మున్సిపల్ ఎన్నికల్లో నియమావళికి విరుద్ధంగా అక్రమాలకు పాల్పడితే గతంలో ఉన్న 3–6 మాసాలు మాత్రమే శిక్షలు ఉండేవి
ఇప్పుడు పదవినుంచి తొలగించడమే కాకుండా, గరిష్టంగా 3 యేళ్ల జైలు శిక్ష, రూ.10వేలు జరిమానా
ఎన్నికల్లో నెగ్గిన తర్వాత కూడా ప్రలోభాగాలకు, నియమావళికి విరుద్ధంగా వ్యవహరించారని ధారాలు లభిస్తే పదవులనుంచి తొలగింపు, చట్ట ప్రకారం చర్యలు
లెక్కింపు సమయం మినహా మొత్తం 13 నుంచి 15 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగించేలా సవరణలు
పంచాయితీ ఎన్నికలల్లో ప్రచార గడువు 5 రోజులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రచారగడువు 7 రోజులుగా నిర్ణయిస్తూ కేబినెట్ ఆమోదం
గిరిజనులకు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకున్న మంత్రిమండలి
నూటికి నూరుశాతం గిరిజన జనాభా ఉన్న తండాల్లో పంచాయితీ వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీ పదవులు పూర్తిగా వారికే కేటాయించాలని నిర్ణయం
పారిశుద్ధ్యం, పచ్చదనం పెంచే బాధ్యతలు కూడా సర్పంచులకే అప్పగిస్తూ నిర్ణయం
ఎన్నికైన సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ఆయా గ్రామాల్లోనే స్ధానికంగా నివసించాలని కేబినెట్ నిర్ణయం
ప్రకృతి వైపరీత్యాలు, నీటి ఎద్దడి సమయంలో అత్యవసర చర్యలు తీసుకునే అధికారం సర్పంచులకే
పంచాయితీ ఎన్నికలకు సంబంధించిన ఈ నియమాలన్నీ కూడా మున్సిపాల్టీలలో పోటీ చేసే అభ్యర్ధులకూ వర్తింపజేస్తూ నిర్ణయం